Monday, May 2, 2011

కే సి ఆర్ సరి కొత్త వ్యూహం

ఇటివల జరిగిన తెరాసా సభలో కే సి ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు బంగాళా కాతంలో విలీనం చేస్తారని విమర్శలు ఎక్కు పెట్టారు. మొన్నటి దాక తన పార్టీ నేతల తోనే విలీనం ప్రకటనలు చేయించిన కే సి ఆర్ అకస్మాతుగా రూట్ మార్చడం వెనుక మతలబు ఏమిటని అందరు చర్చించుకుంటున్నారు .
కే సి ఆర్ చాలా తెలివిగా కాంగ్రెస్ పార్టీ ని ఇరుకున పెట్టేందుకు ఈ ప్రకటన చేసారు. ఒక వేళ తెలంగాణ ఇస్తే తన పార్టీని సైతం వదులుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రజలకు చేరవేశారు. అదే సమయములో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే ఆ పార్టీని బంగాలకతం లో విసిరేసుందుకు సిద్దంగా ఉండాలని ప్రజలను సమాయత్తం చేస్తున్నారు. దీన్ని బట్టి కే సి ఆర్ తాను తెలంగాణ అంశాన్ని రాజకీయాలకు వాడుకోవడం లేదనే విషయాన్నీ ప్రజల వద్దకు చేరవేయ గలిగారు. ఇక కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎలా ఎదుర్కుంటారో చూడాలి .

Friday, April 8, 2011

ఢిల్లీ లో ఏం జరుగుతోంది ?

ఒకటి మాత్రం వాస్తవం . మే నెలలో అద్బుతాలు జరుగుతాయని అందరు ఆశలు పెట్టుకుంటున్నారు. కాని కేంద్రం రాష్ట్ర విభజనఫై ఇప్పట్లో తేల్చే పరిస్తితులు కనిపించడం లేదు. తెరా స విలీనం ఫై చర్చలు జరిగిన తరువాతే తెలంగాణా అంశం ఫై కేంద్రం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.